వాహనదారులకు ఊరటనిచ్చిన కేంద్రం..
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం.
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక లీటర్ డీజిల్ పై రూ.6, పెట్రోల్ పై రూ.8 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ద్రవ్యోల్బణం అమాంతం పెరుగుతూ పోతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులతో మనదేశంలో లో ఇంధన ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలావుండగా, గతంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాట్ ధరలను తగ్గించాలని ప్రధాని మోదీ సూచించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం దేశ ప్రజలపై విపరీతమైన భారం పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. కాగా, ఈ తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. లక్ష కోట్లకు పైచిలుకు రాబడి తగ్గే అవకాశం ఉంది.
కాగా, దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు నిర్ణయం వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ప్రజలకు ఊరట ఇవ్వడంతో పాటు, వారి జీవితాన్ని సులభతరం చేస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు.

Jai Bjp..
ReplyDeleteJai Modi