తెలంగాణలో మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు..
హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక..
లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలి..
తెలంగాణ:
రాష్ట్రంలో మరో రెండు రోజుల భారీ వర్షాలు కురుస్తాయని దాదాపు అన్ని జిల్లాలోనూ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సోమవారం కుమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల , ఆదివాద్ , జగిత్యాల రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ,మేడ్చల్ మల్కాజ్ గిరి , జనగామ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. 12న(మంగళ వారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల , కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, యదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది. కాగా, గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం, మహదేవ్ పూర్ లో 34.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాటారంలో 34.3, మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 23.4, చెన్నూరులో 23.3, నిర్మల్ జిల్లా ముథోల్లో 22.9, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 22.6, నిర్మల్ జిల్లా భైంసాలో 19.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో 19.1, నిజామాబాద్ జిల్లా నవీపేట్లో 19, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 18.2, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 17.9, నిజామాబాద్ జిల్లా మాచర్లలో 17.8, అదే జిల్లా మదనపల్లెలో 17.6, ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్ లో 17.4, నిజామాబాద్ జిల్లా మగిడిలో 16.9, ఆసిఫాబాద్ జిల్లా ఎల్కపల్లిలో 16.8, నిజామాబాద్ జిల్లా రెంజల్లో 16.5, పెద్దపల్లి జిల్లా ఎక్లాస్ పూర్లో 16.2, నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో 16 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

No comments:
Post a Comment