ఉపాధి కూలీగా ఆ గ్రామ సర్పంచ్..
- చేసిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులో ఆలస్యం..
- అప్పులకు మిత్తి పెరిగి, ఇల్లు గడవక ఉపాధి పనికి..
- బిల్లులు ఇప్పించాలని సర్పంచ్ వేడుకోలు..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ఆమె ఆ గ్రామానికి ప్రథమ పౌరురాలు. తనకున్న హోదాను సైతం పక్కన పెట్టీ మరీ ఉపాధి కూలీ పనికి పోతున్నది.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండ మండలం భీమదేవరపల్లి మండలం విశ్వనాథ కాలనీ (నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయితీ)కి వల్లెపు అనిత గ్రామ సర్పంచిగా ఎన్నికైనారు. అయితే, గ్రామానికి పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటికతో పాటు పలు అభివృద్ధి పనులు లక్షలు వెచ్చించి సకాలంలో పూర్తి చేశారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి డబ్బులను బయట మిత్తికి తెచ్చి మరీ పనులు చేశారు. అయితే, పనులు పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు మాత్రం చెల్లించలేదు. దీంతో, తెచ్చిన అప్పులకు మిత్తికి మిత్తి పెరిగింది. అంతేకాకుండా, ఇంట్లో పూట గడవడమే ఇబ్బందిగా మారింది. దీంతో, చేసేదేం లేక తన సర్పంచి హోదాను పక్కనపెట్టి భర్తతో కలిసి ఉపాధి హామీ(వంద రోజుల) పనికి పోతుంది. అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు స్పందించి చేసిన పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచ్ అనిత వేడుకుంటుంది.

That's true in prajent situation
ReplyDeletetq anna
Delete