జూబ్లీహిల్స్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసు శాఖకు నోటీసులు జారీచేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. మరోవైపు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ నుంచి పోలీసు శాఖకు నోటీసులు అందాయి. ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు తీర్పుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ ఘటననపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల వైఖరిని కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తుంది.

No comments:
Post a Comment