Wednesday, 27 July 2022

సొంత పనులకు పంచాయతీ ట్రాక్టర్..!

 సొంత పనులకు పంచాయతీ ట్రాక్టర్..!




పంచాయతీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న కొంత మంది సర్పంచ్ లు..

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు..

చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్..


తెలంగాణ:

గ్రామపంచాయతీ అవసరాలకు వాడాల్సిన పంచాయితీ ట్రాక్టర్ ను కొంతమంది సర్పంచులు తమ ఇష్టానికి వాడుకుంటున్నారు.

గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడంతో పాటు, హరితహారం, పల్లె ప్రకృతి వనం మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లు నేడు ప్రైవేట్ పనులలో బిజీగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో కొన్న ట్రాక్టరే అని కొందరు తమ సొంత ట్రాక్టర్‌లా భావిస్తున్నట్లుంది. మేము ఏమి చేసినా నడుస్తుంది అనే కొందరు సర్పంచులు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ వనరులను ఉపయోగించి సొమ్ము చేసుకునే ప్రయత్నం, కొంత బంధు ప్రీతి చూపిస్తున్న సంఘటన ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని లోక్యతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తుల పనులకు ఇష్టారాజ్యంగా మారింది. కూసుమంచి మండల కేంద్రంలోని నేలకొండపల్లి రోడ్డులో లోక్యతండాకు చెందిన వ్యక్తి ఇళ్లు నిర్మాణం చేస్తున్నాడు. అయితే, ఆ నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ లోక్యతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తో సమకూర్చుతున్నారు. మండల పరిషత్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ తంతు జరుగుతున్నా, అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి నెలవారీగా EMI రూపంలో లోన్ చెల్లిస్తుంటే లోక్యతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మాత్రం బయట ప్రైవేట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోయారు. ఈ ఘటన పై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అంటున్నారు.

1 comment:

  1. Nice matter....every village same problem...tq u

    ReplyDelete

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...