26న కేడీసీలో పూర్వ విద్యార్థుల సమావేశం..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
హనుమకొండ కొత్త బస్టాండ్ రోడ్డులోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26(గురువారం)న పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కళాశాలలో విద్యనభ్యసించి ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని, దేశవిదేశాల్లో స్థిరపడ్డట్లు వెల్లడించారు. అటువంటి వారందరినీ ఒక వేదికపై తీసుకొచ్చేందుకే ఒక ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం డాక్టర్ వినోద్ రావు 99663 43468, మొగిలి 98497 30523 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారెడ్డి కోరారు.

కెడిసి పూర్వ విద్యార్థులకు ఉపయోగ పడే న్యూస్..
ReplyDeleteబాగుంది శ్రీనివాస్ గారు
గుడ్ జాబ్