పది పరీక్షలు రేపటి నుంచే..
- పకడ్బంది ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ..
- 5 నిమిషాలు ఆలస్యమయితే నో ఎంట్రీ..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
రేపటి నుండి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9:30 గంటలనుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో 5,09,280 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం పరీక్షల విభాగం నుండి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ లు, రాష్ట్ర వ్యాప్తంగా మరో 144 స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల మధ్య 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షలు పూర్తయ్యేవరకూ దగ్గరలోని జిరాక్స్ కేంద్రాలన్నీ మూసివేసి ఉంచాలని విద్యాశాఖ వెల్లడించింది.
కాగా, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థులు ఆందోళనకు గురవకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని, విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం కొరకు సంచాలకుల కార్యాలయంలో స్పెషల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు.

No comments:
Post a Comment