గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందే...
- ఊపిరి ఉన్నంతవరకు పేద ప్రజల పక్షాన పోరాడుతాం..
- అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు..
- భూములు పంచేవరకు పోరాటాలు ఆపేదేలే: సీపీఐ
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
గుడిసెలు వేసుకున్న ప్రతీ ఒక్క నిరుపేద కుటుంబాల పేద ప్రజలకు ఇళ్ల పట్టాలివ్వాలని, తమ చివరి శ్వాసవరకు పేద ప్రజల కోసం పోరాడుతామని గ్రేటర్ వరంగల్ సిపిఐ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ పరిధిలోని సర్వే నెంబర్ 126లో నిమ్మల చెరువు వద్దగల ప్రభుత్వ భూమిలో సుమారు 600 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. నిమ్మల చెరువును క్రమక్రమంగా పూడుస్తూ భూ కబ్జాదారులు చేస్తున్న క్రమంలో తమ పార్టీ ఆధ్వర్యంలో చెరువును సందర్శించి కబ్జా చేస్తుంది వాస్తవమేనని తేలిన క్రమంలో ఇండ్లు లేని పేదలను సమీకరించి, గుడిసెలు వేయించామని అన్నారు.
ఇళ్లు లేని నిరుపేద ప్రజల పోరాటం చేస్తున్న సీపీఐ నాయకులపై అక్రమ కేసులు, నిర్బంధాలు, బెదిరింపులు చేయడం పద్దతి కాదన్నారు. ప్రజా సమస్యల కోసం శాంతియుతంగా కమ్యూనిస్టులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచి వేసేందుకు ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా, ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, లేనియెడల రానున్న రోజుల్లో పేద ప్రజల పక్షాన ఉండి మరిన్ని భూపోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Super
ReplyDeletetq
Deleteఇళ్ళ పట్టా ఇచ్చే తీరాలి
ReplyDeleteఅవును
Deleteని డిల్లీ టూర్ గురించి చాల చక్కగా వివరించావు శ్రీను.నైస్
ReplyDeletetq
Delete