దేశ రాజధానిలో భారీ వర్షం..
- పలు చోట్ల ఇళ్లు ధ్వంసం..
- లోతట్టు ప్రాంతాలు జలమయం..
- నిలిచిపోయిన విమాన రాకపోకలు..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెల్లవారుజాము నుండి ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. గంటకు సుమారు 60 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో, పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదని, మరికొన్ని గంటల పాటు భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కావున, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. వాతావరణం అనుకూలంగా లేక న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్ ట్విట్టర్ లో వెల్లడించింది.


ఇంత ఎండలో కూడా వర్షాలు ఏంటో.. ఏమో
ReplyDelete