జూ లో వింత జీవి సంచారం..
అర్ధరాత్రి రెండు కాళ్ళతో జూ లో నడక..
టెక్సాస్ లోని అమారి జూ లో ఘటన..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
మన కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి ఈ భూమ్మీద. కొన్ని సందర్భాల్లో భూమి మీద చోటుచేసుకునే వింతలను చూసి నిజమేనా? అని షాక్ అవుతుంటాము. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. టెక్సాస్‌లోని అమారి పట్టణంలో ఓ వింత జీవి ఫొటో అక్కడున్న వారిని కలవారపాటుకు గురిచేస్తోంది. టెక్సాస్‌లోని ఒక జూ రెండుకాళ్లపై ఓ జీవి నిలబడి ఉంది. ఈ క‍్రమంలో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. అయితే, ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్ దగ్గర ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు
ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్‌లో వచ్చారా? అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు జూ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు.

No comments:
Post a Comment