ఆ రాష్ట్రాన్ని వణికిస్తున్న టొమాటో ఫీవర్..!
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లలను టొమాటో ఫీవర్ వణికిస్తోంది. నిజానికి పిల్లలకు ఏదైనా చిన్న సమస్య వస్తేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు. అలాంటిది ఐదేళ్లలోపు చిన్నారులకే ఎక్కువగా వచ్చే ఈ జ్వరంతో మరింతగా ఆందోళన పడుతున్నారు. నాలుగైదు వారాలుగా వ్యాధి విస్తృతంగా ఉన్న కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలను బెంబేలెత్తిస్తుంది.
కొద్దిగా ఆసక్తికరమైన పేరుతో ఉన్న ఈ జ్వరం డెంగీ లేదా చికెన్ గున్యా తరహాకు చెందినదా? లేక ఇతరత్రా మరేదైనా గ్రూపునకు చెందిన వైరస్‌నా అన్న విషయం ఇంకా నిర్ధారణగా తెలియదు. అయితే, ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్సా లేక అడినో వైరస్సా అనే అంశంపై నిపుణుల్లో ఇంకా చాలా సందేహాలే ఉన్నాయి. ఈ విషయమై వైరాలజీ, వైద్యవర్గాలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.

No comments:
Post a Comment