రేపే పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
తెలంగాణ:
రేపు తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పాలీసెట్-2022)ను నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సులకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 365 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, పరీక్షా కేంద్రాల్లోకి గంట ముందే అభ్యర్థులను అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. పరీక్ష రాసే వారు తప్పకుండా 10 గంటలకే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment