పల్లె ప్రకృతి వనాలను పట్టించుకోరా!?
టార్గెట్ పూర్తయ్యిందని పిపివి కూలీల తొలగింపు..
నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కలు..
లక్షలు వెచ్చించి ప్రకృతి వనాల నిర్మాణం..
మొక్కల కొనుగోలు సందర్భంలో అధికారుల చేతివాటం..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ఈజీఎస్ నిధుల నుండి లక్షలు వెచ్చించి ఒక్కో గ్రామంలో ఒక్కో పల్లె ప్రకృతి వనం లను అధికారులు నిర్మించారు. అయితే మొన్నటి వరకు మొక్కల సంరక్షణ బాధ్యతలు గ్రామ పంచాయతీ నిర్వహించింది. ఇప్పుడు టార్గెట్ పూర్తి అయిందన్న సాకుతో వాటి సంరక్షణ బాధ్యతలు గాలికొదిలేశారు. ప్రస్తుతం నీళ్లు పట్టడం లేదు ఆ మొక్కలకు. వెరసి, ఆ మొక్కలు ఎండిపోతున్నాయి.
కొన్ని గ్రామాల్లో అయితే ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో పల్లె ప్రకృతి వనం లను ఏర్పాటు చేశారని, మేము ఒక్కసారి కూడా ఆ పార్కుకు వెళ్లలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై పార్కుల పేరిట ప్రభుత్వ సొమ్మును లక్షలాది రూపాయలను కాజేశారనే విమర్శలూ గ్రామాల్లో వినిపిస్తున్నాయి. ఏదో, తూతూ మంత్రంగా మమా అనిపించేశారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేసి తీసుకువచ్చారు. అయితే, అట్టి మొక్కలకు బిల్లులు కూడా సరిగా లేకపోవడం, ఒకవేళ కొన్ని బిల్లులు ఉన్నప్పటికీ, మొక్కల కొనుగోలు ధరల కంటే రెండు మూడింతలు ఎక్కువ ధరలను బిల్లులో చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, పల్లె ప్రకృతి వనాలకు గ్రామపంచాయతీ నిధుల నుండి 10శాతం నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఇదే అదనుగా భావించిన కొన్ని గ్రామాల సర్పంచ్ లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కుమ్మక్కై పల్లె ప్రకృతి వనాలను ఖర్చు చేయకుండానే ఖర్చు చేసినట్లు బిల్లుల్లో చూపించి, వారి జేబులు నింపుకున్నట్లు ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

tq
ReplyDelete