రాష్ట్రపతి ఎన్నిక కొరకు ముగిసిన పోలింగ్..
ఓటు వేసిన సోనియా, రాహుల్..
వీల్ చైర్ పైన వచ్చి ఓటేసిన మన్మోహన్ సింగ్..
తెలంగాణ:
రాష్ట్రపతి ఎన్నిక కోసం జరిగిన పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఆయా రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈనెల 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీలో 173 మంది ఓటు వేయగా, తెలంగాణలో 118 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 26న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో మరోసారి విపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా కూడా హాజరుకానున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి.. వైసీపీ, టీడీపీ ఓటేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్. ఓవైపు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీలో పలు రాజకీయ పక్షాలు నిరసన చేపట్టాయి. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఒకే మాట మీద నిలబడి.. ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రపతి అభ్యర్తి యశ్వంత్ సిన్హాకు ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓటు వేయవచ్చని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ నేతలు వెస్టిన్ హోటల్‌లో రాత్రులు గడిపారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల కోసం తమ ఓటు వేశారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ కూడా ఓటు వేశారు.
మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌పై పార్లమెంటుకు వచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


No comments:
Post a Comment