దంచి కొడుతున్న ఎండలు..
పలు రైళ్లు రద్దు.. స్కూళ్లు మూసివేత..
నరకం చూస్తున్న యూరప్ వాసులు..
తెలంగాణ:
వాతావరణం అనేక మార్పులకు కారణమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే, అతివృష్టి.. లేదంటే అనావృష్టి, అత్యధిక ఉష్ణోగ్రతలతో అనేక దేశాలు అల్లాడిపోతున్నాయి.
ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరైనా యూరప్ దేశాలు సైతం ఇప్పుడు వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాయి. గత కొన్ని రోజులుగా యూకే, స్పెయిన్, పోర్చుగల్ ఫ్రాన్స్‌లలో ఎండలు మండిపోతున్నాయి.
ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.
దీనికి తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో, బ్రిటన్ వాతావరణ విభాగం రెడ్ వార్నింగ్ జారీ చేసింది.
లండన్‌తో పాటు ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది. సోమవారం ఎండ, వడగాలులు, ఉక్కపోతతో బ్రిటన్ వాసులు అల్లాడిపోయారు.
దీంతో, కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా, పాఠశాలలను మూసివేశారు.అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం కోరింది. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్‌లలోని గ్రామీణ ప్రాంతాల్లో కార్చిచ్చు కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. 2019లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని బొటానిక్ గార్డెన్ పరిసరాల్లో నమోదైన 38.7 సెల్సియస్‌ల ఉష్ణోగ్రతే ఇప్పటి వరకు బ్రిటన్‌లో అత్యధికం. ఈ రికార్డు సోమవారం బద్ధలైంది.

No comments:
Post a Comment