Saturday, 23 July 2022

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..

 తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..



తెలంగాణ:


రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణలోని 11 జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. అంతేగాక, రాబోయే 4 వారాల పాటు వ‌ర్షాలు స‌మృద్ధిగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. వర్షాల దృష్ట్యా నగర వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. అదేవిధంగా మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు అలర్ట్‌ జారీ చేశారు వాతావరణ శాఖాధికారులు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...