యమ డేంజర్ కోనోకార్పస్ చెట్టు..
తెలంగాణ:
వృక్షోరక్షితి రక్షతః అంటారు పెద్దలు. అంటే వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్. పచ్చదనం మాటున విరివిగా పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి. దుబాయి చెట్టుగా పిలువబడుతున్న ఈ వృక్షం ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతోంది.
అమెరికా ఖండాల్లోని తీరప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా పెరిగే ఈచెట్టు పచ్చదనాన్ని అంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అరబ్, మధ్య ప్రాచ్యదేశాల్లో ఏడారినుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్ల నుంచివేడిగాలుల నుంచి రక్షణగా ఉండేందుకు ఈ మొక్క ను దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచుతున్నారు.
పలు పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనోకార్పస్ మొక్కలను నాటడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. హరితవనం కార్యక్రమంలో తొలుత ఈ మొక్కలనే ఎక్కువగా వినియోగించిన ప్రభుత్వం త్వరలోనే వీటి దుష్ప్రభావాలను గుర్తించడం గమనార్హం.
కోనోకార్పస్‌మొక్కపర్యావరణాన్ని హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుందని పొరుగుదేశమైన పాకిస్తాన్ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో తేల్చింది. గా లిలో ఎక్కువ సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి చేటు అని మరికొన్ని అరబ్‌దేశాలు గుర్తించాయి.
మొక్కలను నిషేధించాలి..
మహారాష్ట్రలోని పూణే, మన పొరుగున ఉన్న తెలంగాణలో దుబాయి మొక్కలను నాటడాన్ని నిషేధించినట్లుగానే మన రాష్ట్రంలో కూడా నిషేధించాలి. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలిగించే ఏ అంశానైనా ప్రభుత్వాలు అడ్డుకోవాలి.
అఖిలేష్ , కేజీ మార్గ్, న్యూఢిల్లీ, పర్యావరణ ప్రేమికుడు..

No comments:
Post a Comment