Sunday, 31 July 2022

స్ఫూర్తిగా నిలుస్తున్న విష్ణుమూర్తి..

 స్ఫూర్తిగా నిలుస్తున్న విష్ణుమూర్తి..



తెలంగాణ:

రెండు కాళ్లు లేకపోయినా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తిది ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేట గ్రామం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విష్ణుమూర్తి డిగ్రీ చదువుతూనే తన పేరెంట్స్ కి అన్ని పనుల్లో సాయం చేసేవాడు. మూడేళ్ల క్రితం ఒకసారి వారి పొలంలో వరికోస్తున్న సమయంలో ధాన్యం తీస్తానని చెప్పి క్రషర్‌పై ఎక్కాడు. ప్రమాదవశాత్తు అతని రెండు కాళ్లు క్రషర్‌లో పడి నుజ్జునుజ్జు అయ్యాయి. డాక్టర్లు కాళ్లు సగానికి తొలగించారు. అయినా అందరి లాగా కాళ్లు లేవని కుంగిపోకుండా కృత్రిమ కాళ్లతో తాను స్వతహా అన్ని పనులు చేయ గలనని నిరూపిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. మనోధైర్యం ఉంటే ఎంతటి అంగ వైకల్యం అయినా జయించవచ్చని నిరూపిస్తున్నాడు.

రెండు కాళ్లు పోయినా విష్ణు ఆత్మసైర్థ్యం మాత్రం కోల్పోలేదు. నడవడమే కాదు. కృత్రిమ కాళ్లతోనే ద్విచక్ర వాహనం నడపడం, పంటలకు నీళ్లు పెట్టడం, కలుపు తొలగించడంతో పాటు పంటలకు మందులు పిచికారి చేయడం, ట్రాక్టర్‌ నడపడం, పశువుల ఆలనాపాలన చూడడం, ఒక్కటేమిటి.. అన్నీ అందరిలాగానే చేస్తూ శభాష్‌ అని పించుకుంటున్నాడు. వైకల్యం ఉన్నా కుటుంబానికి భారం కావద్దని పేదతల్లిదండ్రులకు అండగా ఉంటూ వ్యవవసాయ పనులు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...