Tuesday, 12 July 2022

ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ..

 ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ..



  • భద్రాచలానికి ప్రమాద హెచ్చరికలు జారీ..
  • సాయంత్రం కల్లా నీటిమట్టం 66 అడుగులకు చేరే అవకాశం..
  • కరకట్ట వైపు పొంచి ఉన్న ప్రమాదం..


తెలంగాణ:

భారీ వర్షాలకు తెలంగాణలోని భద్రాచలం వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ నదికి వరద ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, భద్రాచలం వద్ద ముప్పు పొంచి ఉందని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎగువ నుండి వస్తున్న వరదల వల్ల ఈరోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులు వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద శరవేగంగా గోదావరి పెరుగుతున్నదని, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించి, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. గోదావరి 66 అడుగులకు చేరితే కరకట్ట పరిస్థితి ఏంటని? ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే, బూర్గంపాడు వైపు కరకట్ట నిర్మాణం జరగలేదు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 66 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరితే భద్రాచలం పాత వంతెన పై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ పోతుండటంతో చుట్టు పక్కన ఉన్న ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఒకవేళ గోదావరి నీటిమట్టం 66 అడుగులు దాటితే పరివాహక  ముంపు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నదని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...