Wednesday, 6 July 2022

లోపించిన పారిశుధ్యం..

 లోపించిన పారిశుధ్యం..



- గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే..

- నిరుపయోగంగా డంపింగ్ యార్డులు..

- పట్టించుకోని అధికారులు..


తెలంగాణ:


రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధే దేశాభివృద్ధని గొప్పలు చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. గ్రామ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన ప్రజాప్రతినిధులు, సంబధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాలా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ఫలితంగా విష జ్వరాలు విజృభిస్తున్నాయి. దీంతో,  ప్రజలు అనారోగ్యానికి గురై అస్పత్రుల పాలవుతున్నారు. అయినా, అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పారిశుధ్యం లోపించి ప్రజలు అస్పత్రుల పాలైతే తప్పా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించడం లేదు. గ్రామాభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర వహించే పంచాయతీ కార్యదర్శులు ఏదో నామమాత్రంగా గ్రామాలను సందర్శిస్తున్నారు. అభివృది పనుల పేరిట జేసీబీలతో పైపు లైన్‌లు నిర్మించడంతో పాత పైపులు ధ్వంసమై నీటి సరఫరా అయ్యే చోట నీరు కలుషితమవుతుంది. వెంటనే సరి చేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్మాణం పూర్తయ్యే వరకు స్పందించడం లేదు. కొందరు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు రావడం లేదని ఫిర్యాదు చేస్తే తప్పా, గ్రామాన్ని సంద ర్శించడం లేదు. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ త్రాగు నీరు, విద్యుత్‌, కరెంట్‌, రోడ్లు, మురికి కాలువులు తదితర సౌకర్యా లు ప్రజలకు కల్పించాలి. మురికి కాల్వల్లో చెత్తా, చెదారం పేరుకుపోయి అపరిశుభ్రం అవుతుందని, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రచారం నిర్వహించారు. దీంతో ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. వాటికి బిల్లులు రాకపోవడంతో అటు మురికి కాల్వలోకి నీరు వెళ్లకా, ఇటు ఇంకుడు గుంతలకు వదలకా రోడ్డుపైనే మురుగు నీరు ప్రవాహి స్తుంది. దీంతో, దుర్గంధం, అపరిశుభ్రత నెలకొని వ్యాధులు వచ్చేం దుకు ఆస్కారమవుతుంది. అడపాదడపా వర్షాలు పడటంతో వర్షపు నీరు, బురద నీరు లోతట్టు ప్రాంతానికి చేరి దుర్గంధం వెదజల్లు తోంది. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి  బిల్లులు చెల్లించాల్సిన అధికారులు పూర్తిగా దాటా వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...