అమర్నాథ్ లో ఆకస్మిక వరదలు..
10 మంది మృతి.. పలువురు గల్లంతు..
తెలంగాణ:
ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు అమర్‌నాథ్ యాత్రికులు గల్లంతయ్యారు. జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. వరదల ధాటికి అమర్‌నాథ్ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో 40 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మిగతా వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అమర్నాథ్ పరిసరాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. దీంతో, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. వరదల దృష్ట్యా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
అమర్నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకోవాలంటే శ్రీనగర్‌కు దాదాపు 90కి.మీ దూరంలో పహల్గామ్‌తోపాటు బాల్తాల్ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. ఆయా మార్గాల్లోని బేస్ క్యాంపుల నుంచి బ్యాచ్‌ల వారీగా పంపిస్తారు. జూన్ 30న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటికే లక్ష మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

No comments:
Post a Comment