రూపాయి పంపి.. ఆపై రూ.50లక్షలు కొట్టేసి..
తెలంగాణ:
సైబర్ నేరాలు రోజు రోజుకూ విస్తరిస్తున్నాయి. కేటుగాళ్లు కొత్త కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులను టార్గెట్ చేస్తూ, లక్షలు దండుకుంటున్నారు. తాజాగా, జరిగిన మోసం తెలిసి అంతా షాక్ కు గురవుతున్నారు. నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు వెతికి నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా, ప్రజలకు పదే పదే అవగాహన కల్పిస్తున్నా, సైబర్ కేటుగాళ్ల మోసాలు ఆగడం లేదు. అది కూడా నిరక్ష్యరాసులను కాదు. బాగా చదుకున్న వారిని, ప్రముఖులను, వ్యాపారవేత్తలను సైతం మోసం చేస్తున్నారు. తాజాగా, జరిగిన మోసం గురించి తెలిసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఇంత ఈజీగా మోసం చేయొచ్చా అని షాక్ అవుతున్నారు. మహేశ్ శర్మ అనే వ్యక్తి కడపలో సిమెంట్ వ్యాపారి. ఓ రోజు అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అర్జెంట్ గా తనకు 100 సిమెంట్ బస్తాలు పంపించాలని మెటీరియల్ డెలివరీ అయిన వెంటనే అక్కడ డబ్బులు కూడా ఇచ్చేస్తామని చెప్పాడు ఆ వ్యక్తి. మహేశ్ శర్మ చాలా ఆనందంతో పొద్దున్నే చాలా మంచి గిరాకి వచ్చిందని 100 సిమెంట్ బస్తాలు లోడ్ చేయించి, సదరు వ్యక్తి చెప్పిన అడ్రస్ కు పంపించాడు. సరకు డెలివరీ కూడా అయ్యింది. వెంటనే మళ్లీ ఆ వ్యక్తి మహేశ్ శర్మకు ఫోన్ చేసి మీరు పంపించిన సరుకు చేరుకుంది. డబ్బులు ఎంతో చెప్పండి పంపిస్తామని నమ్మకంగా చెప్పాడు.
అప్పటికే సంతోషంలో ఉన్న మహేశ్ శర్మ 100 సిమెంట్ బాస్తాలకు ఎంతైందో చెప్పాడు. మీరు అలాగే లైన్ లో ఉండండి మీ అకౌంట్ కు డబ్బు పంపిస్తానని మొదట ఒక రూపాయి మీ అకౌంట్ కు పంపించాను ఒక సారి కన్ఫామ్ చేయండి అని అన్నాడు. డీల్ అంతా సజావుగా సాగుతుంది కదా అని కొంచెం కూడా అనుమానించడకుండ మహేశ్ శర్మ తమ ఫోన్ లో సదరు వ్యక్తి పంపించిన లింక్ తో ఉన్న ఒక రూపాయి డబ్బును కన్ఫాం చేశాడు.
కానీ, అంతలోనే ఊహించని షాక్ తగిలింది. అక్కడ నుంచి తన బిజినెస్ అకౌంట్ లో ఉన్న రూ.50 లక్షలు మొత్తము మాయమయ్యాయి. వెంటనే తేరుకుని తాను మోసపోయాని పోలీసులను ఆశ్రయించాడు మహేశ్ శర్మ. ఇది ఒక మహేశ్ శర్మకు జరిగిన మోసమే కాదు. ప్రస్తుతం ఏపీలో చాలా మంది వ్యాపారస్తులు ఇదే విధంగా మోసపోతున్నారు.
ముఖ్యంగా సామాన్యులను టార్గెట్ చేస్తే ప్రజల్లో ఉన్న అవగాహాన మూలంగా చాలా వరకు మోసాలు చేయడానికి వీలు కాకపోవడంతో ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్లు తమ రూటు మార్చి వ్యాపారస్తులను మోసం చేస్తోన్నారు. ఏపీ వ్యాప్తంగా గత నెల రోజుల్లో ఇలాంటి కేసులు 142 నమోదైనట్లు తెలుస్తోంది. ఇంకా 200 కేసులు వరకు పోలీస్ వద్దకు రానివి ఉంటాయని అంచన వేస్తోన్నారు పోలీసులు. పరువు పోతుందని తమకు జరిగిన మోసాన్ని బయటికి చెప్పుకోవడానికి కూడా చాలా మంది వెనుకడు వేస్తోన్నారని అంటున్నారు పోలీసులు.

No comments:
Post a Comment