Monday, 3 October 2022

వెంకటేశ్వర్లపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..

 వెంకటేశ్వర్లపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..



తెలంగాణ:

తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు సోమవారం నాడు సద్దుల బతుకమ్మ తో వేడుకలు ఘనంగా ముగిశాయి.

ఏ దేవుడిని అయినా, పూలతో పూజిస్తాము. కానీ, పూలనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతీ తెలంగాణ రాష్ట్రానిది.



పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ సంబరాలను తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు కనులపండువగా నిర్వహించారు. కాగా, చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో ఘనంగా ముగిశాయి. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆట స్థలాన్ని డోజర్ తో చదును చేసి, లైటింగ్, డీజే ఏర్పాటు చేశారు. అదేవిధంగా, యూత్ కమిటీ సభ్యులు మంచి నీటిని అందజేశారు.

గ్రామంలోని మహిళలు, యువతులు, చిన్నారులంతా ఒక్క చోటుకి చేరుకుని బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ సందడి చేశారు. 

కాగా, ఈ సద్దుల బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు బతుకమ్మలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ బతుకమ్మ వేడుకల్లో  గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, జీపీ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...