స్నేహితురాలి పిల్లలకు ఆర్థిక చేయూత..
తెలంగాణ:
తమతో పాటు కలిసి పదవ తరగతి వరకు చదువుకున్న మిత్రురాలు ఇంచర్ల సుమత అకాల మరణం చెందగా, బుధవారం వారి పిల్లలకు ఆర్థిక చేయూత అందించి అండగా నిలబడ్డారు. మండలంలోని జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఇంచర్ల సుమత కు వివాహమై ఇద్దరు ఆడపిల్లలు అక్షయ, అవంతిక లు ఉన్నారు. అయితే, కుటుంబ పరిస్థితుల వల్ల సుమత మృతి చెందింది. దీంతో, జగ్గయ్యపేట హైస్కూల్ 2008-09 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు తలా కొంత ఆర్థిక సహాయం చేశారు. అలా సేకరించిన మొత్తం రూ.25,000 వారి పిల్లలకు అందజేశారు. వారు చేసిన సాయం పట్ల పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చేయూతనిచ్చిన కార్యక్రమంలో తోటి స్నేహితులు మడప వసుమత, గోపు లక్ష్మీ, తనుగుల సుమత, యండి రేష్మ, గాలెంక సుమత, లకిడే రాజు, నూక హరికృష్ణ, గంటే సుమన్, బైకని కుమారస్వామి, చింతల తిరుపతి, ఇప్పకాయల తిరుపతి, లెంకలపల్లి తిరుపతి, మామిండ్ల కుమార్, తాటికంటి నరేష్, గడ్డే శివరావు, చిరిపోతుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment