వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
భారతదేశ రాజధాని ఢిల్లీ నగర నడిబొడ్డున, ఇండియా గేట్ ను ఆనుకొని 'హైదరాబాద్ హౌస్' ఉన్నది. ఇది సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. ఐతే, గత మార్చి, ఏప్రిల్ నెలలో నేను ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మిత్రులతో కలిసి ఓరోజు రాత్రి హైదరాబాద్ హౌస్ ను సందర్శించాను. అక్కడ నేను హైదరాబాద్ హౌస్ గురించి తెలుసుకున్న కొన్ని విషయాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
దేశ రాజధాని ఢిల్లీలో ఏడో నిజాం రాజు ఢిల్లీ వెళ్లినప్పుడు తమ విడిది కోసం ఓ భవనం ఉండాలని భావించారు. అనుకున్నదే తడవు ఈ (హైదరాబాద్ హౌస్) భారీ కట్టడానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం విదేశీ వాస్తుశిల్పి అయిన లుటియిన్స్ కు పనులను అప్పగించారు. మొగలుల శైలిని కలగలుపుతూ దీనిని నిర్మించారు. హైదరాబాద్ హౌస్ కు వెళ్లినప్పుడు ఎత్తైన గుమ్మటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీని నిర్మాణానికి బర్మా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఎంతో విలువైన టేకు కలపను ఇందులో ఉపయోగించారు.
ఇకపోతే, హైదరాబాద్ హౌస్ అంటేనే విలేకరుల సమావేశాలు, విదేశీ ప్రముఖులతో చాయి పే చర్చా తో పాటు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా అన్నింటికీ వేదిక హైదరాబాద్ హౌస్ ఒకటే. ఏ దేశ అధ్యక్షుడైనా ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ హౌస్ గడప తొక్కి తీరాల్సిందే. ఈ నిజాం రాజు ప్రభువుల కలల సౌధంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ హౌస్ మన హైదరాబాద్ కు ప్రతిబింబంగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఢిల్లీలో నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఇస్లాం సాంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా, అత్యాధునిక యూరోపియన్ శైలిలో నిర్మించడంతో ఇందులో నివాసం ఉండేందుకు నిజాం కుమారులు ఇష్టపడలేదని సమాచారం. ఇదిలావుండగా, దేశ, విదేశీ ముఖ్యులు ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ హౌస్ ను చూసి ఎంతో మంత్రముగ్ధులు అయ్యేవారు. ఐతే, అంతటి గొప్ప గుర్తింపు ఉన్న ఈ ప్యాలెస్ ను నిర్మించిన నిజాం రాజు కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే సందర్శించారని అక్కడున్న వారు తెలిపారు
.

Useful Information
ReplyDeletetq for ur valuable comment.
DeleteMeeru Delhi ki epudu vellaru brother, anything special or just a tour ??
ReplyDeleteI went to New Delhi for some work. I was there for a month. #Currently living in Hyd.
Deleteనువ్వు తోపు మిత్రమా..
ReplyDeleteఢిల్లీ గడ్డ మీద నీ మార్క్ చూపించావ్.
గ్రేట్