Thursday, 19 May 2022

రేగొండ బస్ షెల్టర్..

 రేగొండలో నిలువ నీడ కరువు..!?

ఎండలోనే బస్సుల కోసం గంటలకొద్ది పడిగాపులు..


మరుగుదొడ్లు లేక మహిళా ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం..

పట్టించుకోని పాలకులు, ఆర్టీసీ అధికారులు..




వెంకటేశ్వర్లపల్లి/తెలంగాణ:
ఓవైపు మండే ఎండ.. మరోవైపు సమయానికి రాని ఆర్టీసీ బస్సులు.. వీటికి తోడు బస్ షెల్టర్ కరువు.. వెరసి, అటు పాలకులు, ఇటు ఆర్టీసీ అధికారుల అలసత్వంతో రేగొండ మండల కేంద్రంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోనే అతిపెద్ద మండల కేంద్రమైన రేగొండలో బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రేగొండ మండల కేంద్రంలో ప్రయాణికులకు బస్టాండ్ లేకపోవడంతో ఎండకు, వానకు రక్షణ లేకుండా ప్రయాణికులకు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రధానంగా టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో మహిళ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు విద్యార్థులు ఎండలోనే నిరీక్షించాల్సి వస్తోంది. బస్ షెల్టర్లు లేకపోవడంతో ఇక్కడున్న షాపులు, కిరాణా షాపుల ముందు నిల్చొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.  నిత్యం వేలాది మంది ప్రయాణికులతో వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారితో రేగొండ మండల కేంద్రం కిటకిటలాడుతూ ఉంటుంది. 

 *నాలుగు రూట్లకు మెయిన్ సెంటర్ రేగొండ...* 


రేగొండ మండల కేంద్రం నుండి నాలుగువైపులా ప్రధాన రహదారులు ఉన్నాయి. ఈ రహదారులన్నీ ప్రధానమైన పట్టణాలను కలుపుతాయి.  అందులో ఒకవైపు పరకాల, హన్మకొండ, హైదరాబాద్, అలాగే మరోవైపు గణపురం భూపాలపల్లి, కాళేశ్వరం, సిరోంచ, గడ్చిరోలి..
మరోవైపు జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, గోరికొత్తపల్లి, జాకారం, ములుగు, ఏటూరునాగారం, మల్లంపల్లి నర్సంపేట..
అదేవిధంగా మరోవైపు కోటంచ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, ఒడేడ్ తదితర ప్రధాన గ్రామాలు, పట్టణాలను కలుపతుంది రేగొండ మండల కేంద్రం. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి మండల కేంద్రంలో నేటికీ బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. 
ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణించండి.. క్షేమంగా గమ్యస్థానం చేరుకోండి.. అని ప్రచారం చేస్తున్న ఆర్టీసీ అధికారులు బస్సు షెల్టర్లపై మాత్రం దృష్టి పెట్టడం లేదని పలువురు ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 అధికారులు నిర్లక్ష్యం సరికాదు.


రేగొండలో బస్ షెల్టర్ నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బస్సుల కోసం ఎండకు ఎండి, వర్షానికి తడిసి గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూడాల్సి వస్తుంది. బస్ షెల్టర్ నిర్మాణం కోసం పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు అలసత్వం వీడి వెంటనే బస్ షెల్టర్ నిర్మించాలి.

10 comments:

  1. ఏ ఊళ్ళో ఉన్నా సరే బస్సు కన్నా సొంత వాహనమే మిన్న

    ReplyDelete
    Replies
    1. అవును. కానీ, అన్ని సందర్భాల్లో సొంత వెహికల్ మేలు కాదు. ఆర్టీసి ప్రయాణమే సురక్షితం. శుభప్రదం..

      Delete
  2. రేగొండ లో ప్రయాణికుల సౌకర్యార్థం వెంటనే బస్ స్టేషన్ నిర్మించాలి.

    ReplyDelete
  3. ధన్యవాదాలు మిత్రమా..!
    మీ విలువైన స్పందనకు.

    ReplyDelete
  4. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరం. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న పాండవుల గుట్టపై నిరంతర నిఘా అవసరం.

    ReplyDelete
  5. మీ ప్రతి న్యూస్ ఐటం కూడా ప్రత్యేకంగా, భిన్నంగా ఉంటుంది మామ.
    సమాజహితం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అభనందనీయం.🤝👍🌹

    ReplyDelete
    Replies
    1. చక్కని స్పందనకు వందనం..🙏

      Delete
  6. Yes we need a bus station, common people are suffering without bus shelter

    ReplyDelete

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...