ఖాళీ సీసాల ఆదాయమెంత..?
గ్రామాల వారీగా ఎన్ని ఖాళీ బీరు సీసాలు సేకరించారు?
తద్వారా గ్రామ పంచాయతీకి ఎంతొచ్చింది..
ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారు..
ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన ఓ యువకుడు..
వెంకటేశ్వర్ల పల్లి/ తెలంగాణ:
మీరు వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా, ఇది నిజమే. ఖాళీ బీరు సీసాలను సేకరించి, అట్టి బీరు సీసాలను అమ్మకం చేస్తే గ్రామ పంచాయతీకి ఎంత ఆదాయం సమకూరిందని ఓ యువకుడు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగాడు.
ఇక వివరాల్లోకెళితే.. హన్మకొండ జిల్లా శాయం పేట మండలానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త మండలం లోని అన్ని గ్రామాల్లో ఖాళీ బీరు సీసాల అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం సమకూరిందని అట్టి వివరాలు తెలుపాలని ఎంపీడీవో కార్యాలయ అధికారికి దరఖాస్తు పెట్టుకున్నాడు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్లో ఉన్నట్లుగా ఇప్పటికే అబ్కారీ లెక్కలు తెలియజేస్తున్నాయి. శ్రేయస్కరమైన మద్యాన్ని అందించడమే లక్ష్యంగా అబ్కారీ చర్యలున్నట్లుగా ప్రభుత్వం కూడా సమర్థించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయం అలా ఉంచితే.. బహిరంగ ప్రదేశాల్లో, ఇంటింటి నుంచి మద్యం సీసాలను సేకరించ తలపెట్టిన కార్యక్రమం పై విమర్శలు, గొప్ప కార్యక్రమం అన్న భిన్న చర్చ జరుగుతుండగా తాజాగా ఆర్టీఐ దరఖాస్తుపై నెట్టింట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2021-22 సంవత్సరంలో శాయంపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఏఏ గ్రామంలో ఎన్ని సీసాలను సేకరించారు? సీసాలను ఎంత ధరకు అమ్మారు? అమ్మిన సీసాల ద్వారా ఎంత డబ్బు పంచాయతీలకు సమకూరింది? ఏ పంచాయతీకి ఎంత వచ్చింది? సీసాల సేకరణకు ఏ స్థాయి అధికార, సిబ్బందిని వినియోగించారో తెలపాలన్నాడు.

Excellent! A creative approach. My compliments to the questioner.
ReplyDeleteEvery citizen should go with creative approach in the development of our State, particularly, on matters relating to economy.