సూపర్ లగ్జరీ బస్సులో మంటలు..
తెలంగాణ:
తెలంగాణ ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో 16 మంది ప్రాణాలను కాపాడాడు. స్థానికుల కథనం మేరకు.. బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై దగ్ధమైన హైదరాబాద్ -1 డిపోకు చెందిన టీఎస్‌ఆర్టీసీ లగ్జరీ బస్సు మంటల్లో కాలిపోయింది. కర్నూలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన లగ్జరీ బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం దివిటిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప‍్రయాణికులకు ముప్పు తప్పింది. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. బస్సు అగ్ని ప‍్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.

No comments:
Post a Comment