పది ఫలితాలు రేపే..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపే విడుదల చేయనున్నారు. ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్ ఫలితాలు జూన్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ విడుదల చేయాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాలతో ఈ ఫలితాలను విడుదల చేయలేకపోయినట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించనున్నారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది.

No comments:
Post a Comment