అవినీతి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి..
ఒక్కో కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు సెక్రటరీ రూ.10వేలు వసూలు చేస్తుంది..
తనను సస్పెండ్ చేయాలని గోరికొత్తపల్లి గ్రామస్తుల డిమాండ్..
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, యువకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు జానుశ్రీ టైమ్స్ తో మంగళవారం(ఈరోజు) చరవాణిలో మాట్లాడారు. ఈ సందర్భంగా గోరికొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కల్యాణ లక్ష్మీ లబ్దిదారుని నుండి రూ.5 - 10వేలు వసూలు చేస్తుందని వాపోయారు. అంతేకాకుండా, గ్రామపంచాయతీ సెక్రటరీ గ్రామానికి సంబంధించిన మరుగుదొడ్ల బిల్లులు సైతం ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేసుకుని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుందని పలువురు యువకులు తెలిపారు. అవినీతి అధికారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కరెక్ట్ తమ్ముడు అలాంటి వారిని సస్పెండ్ చేయాలి
ReplyDeleteఅంతేకదా.. నెల నెలా జీతాలు వస్తున్నా, పేద, మధ్య తరగతి ప్రజలను లంచాల పేరిట పీక్కు తినడం ఎంత వరకు సమంజసం. సిగ్గుండాలి ఇసొంటి అవినీతి అధికారులకు. బుద్ధిగా డ్యూటీ చేసుకుంటే సరిపోదా..
Delete