Tuesday, 26 July 2022

మందుబాబులకు అడ్డాగా విలేజ్ పార్కులు..

 మందుబాబులకు అడ్డాగా విలేజ్  పార్కులు..



తెలంగాణ:

ప్ర‌కృతి సౌంద‌ర్యాల‌కు మ‌రింత శోభ‌నిచ్చే విధంగా, ప‌ల్లెల‌కు కొత్తందం తెచ్చేలా పల్లె ప్ర‌కృతి వ‌నాలను హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కానీ, ప్రస్తుతం పలు గ్రామాల్లో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు, పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. ఒక్కో పల్లె ప్రకృతి వనానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. కానీ, అవి చాలా వరకు ఉపయోగంలో లేవు. కొన్ని గ్రామానికి దూరంగా ఉండటం వలన అక్కడికి ప్రజలెవరూ వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో, గ్రామ ప్రజలు, సందర్శకులు వెళ్ళడానికి వీలు లేకుండా బోసిపోతూ కనబడుతున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న పల్లె ప్రకృతి వనాలను అదనుగా చూసుకుని కొంత మంది మందుబాబులు మందు కొట్టడానికి వీటిని అడ్డాలుగా చేసుకున్నారు. ఇందుకు ఉదాహరణగా  ములుగు మండలం లోని మల్లంపల్లి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనం నే చెప్పొచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా  లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు ఇలా నిలవడం బాధాకరం. మరికొన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను పరిశీలిస్తే ఖాళీ మందు సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు, గ్లాసులతో దుర్భరంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా, పల్లె ప్రకృతి వనంలో ఎండిపోయి, రాలిన ఆకులతో నడకదారి నిండిపోయి కనిపిస్తుంది. ఇప్పటికైనా పల్లె ప్రకృతి వనాలపై పంచాయతీ కార్యదర్శులు, జీపి సిబ్బంది దృష్టి సారించి పల్లె ప్రజలకు అందుబాటులోకి పార్క్ ను తీసుకురావాలి. రాత్రి వేళల్లో విలేజ్ పార్క్ లో మద్యం తాగే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు కోరుకుంటున్నారు.

2 comments:

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...