ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఎస్సై నరేష్..
రూ.25వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
తెలంగాణ:
భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఇస్లావత్ నరేష్ ఈరోజు (శుక్రవారం) రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల తనిఖీలతో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఓ సివిల్ కేసు విషయమై బాధిత వ్యక్తి నుండి ఎస్సై నరేష్ రూ.75 వేలు లంచం రూపంలో డిమాండ్ చేశారు. ముందుగా రూ.25 వేలు ఎస్సై నరేష్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

No comments:
Post a Comment