Sunday, 31 July 2022

స్ఫూర్తిగా నిలుస్తున్న విష్ణుమూర్తి..

 స్ఫూర్తిగా నిలుస్తున్న విష్ణుమూర్తి..



తెలంగాణ:

రెండు కాళ్లు లేకపోయినా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తిది ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేట గ్రామం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విష్ణుమూర్తి డిగ్రీ చదువుతూనే తన పేరెంట్స్ కి అన్ని పనుల్లో సాయం చేసేవాడు. మూడేళ్ల క్రితం ఒకసారి వారి పొలంలో వరికోస్తున్న సమయంలో ధాన్యం తీస్తానని చెప్పి క్రషర్‌పై ఎక్కాడు. ప్రమాదవశాత్తు అతని రెండు కాళ్లు క్రషర్‌లో పడి నుజ్జునుజ్జు అయ్యాయి. డాక్టర్లు కాళ్లు సగానికి తొలగించారు. అయినా అందరి లాగా కాళ్లు లేవని కుంగిపోకుండా కృత్రిమ కాళ్లతో తాను స్వతహా అన్ని పనులు చేయ గలనని నిరూపిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. మనోధైర్యం ఉంటే ఎంతటి అంగ వైకల్యం అయినా జయించవచ్చని నిరూపిస్తున్నాడు.

రెండు కాళ్లు పోయినా విష్ణు ఆత్మసైర్థ్యం మాత్రం కోల్పోలేదు. నడవడమే కాదు. కృత్రిమ కాళ్లతోనే ద్విచక్ర వాహనం నడపడం, పంటలకు నీళ్లు పెట్టడం, కలుపు తొలగించడంతో పాటు పంటలకు మందులు పిచికారి చేయడం, ట్రాక్టర్‌ నడపడం, పశువుల ఆలనాపాలన చూడడం, ఒక్కటేమిటి.. అన్నీ అందరిలాగానే చేస్తూ శభాష్‌ అని పించుకుంటున్నాడు. వైకల్యం ఉన్నా కుటుంబానికి భారం కావద్దని పేదతల్లిదండ్రులకు అండగా ఉంటూ వ్యవవసాయ పనులు చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Saturday, 30 July 2022

యమ డేంజర్ కోనోకార్పస్ చెట్టు..

 యమ డేంజర్ కోనోకార్పస్ చెట్టు..



తెలంగాణ:

వృక్షోరక్షితి రక్షతః అంటారు పెద్దలు. అంటే  వృక్షాలను సంరక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని భావం. అయితే, అన్ని చెట్లు అలాంటివి కావని పర్యావరణవేత్తలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కోనో కార్పస్‌. పచ్చదనం మాటున విరివిగా  పెరుగుతున్న ఈ వృక్షాలు ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారనున్నాయి.  దుబాయి చెట్టుగా పిలువబడుతున్న ఈ  వృక్షం  ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతోంది.

అమెరికా ఖండాల్లోని తీరప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్‌ జాతి మొక్క.  వేగంగా  పెరిగే ఈచెట్టు పచ్చదనాన్ని అంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అరబ్, మధ్య ప్రాచ్యదేశాల్లో ఏడారినుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్ల నుంచివేడిగాలుల నుంచి  రక్షణగా ఉండేందుకు ఈ మొక్క ను  దిగుమతి చేసుకుని రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్లలో విస్తృతంగా పెంచుతున్నారు.

పలు పర్యావరణ సమస్యలకు కారణమవుతోందన్న కారణంతో కోనోకార్పస్‌ మొక్కలను నాటడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. హరితవనం కార్యక్రమంలో తొలుత ఈ మొక్కలనే ఎక్కువగా వినియోగించిన  ప్రభుత్వం త్వరలోనే వీటి దుష్ప్రభావాలను గుర్తించడం గమనార్హం.

కోనోకార్పస్‌మొక్కపర్యావరణాన్ని హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుందని  పొరుగుదేశమైన పాకిస్తాన్‌ గుర్తించింది. ముఖ్యంగా కరాచీ నగరంలో హఠాత్తుగా పెరుగుతున్న ఊపిరి తిత్తుల వ్యాధిగ్రస్తుల సంఖ్యకు ఈ మొక్కలే కారణమని పరిశోధనల్లో  తేల్చింది.  గా లిలో ఎక్కువ సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్‌ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించడం అవి కోకోకార్పస్‌ పుష్పాలివిగా తెలియడంతో ఈ మొక్కల పెంపకాన్ని పూర్తిగా నిషేధించింది.అధిక సంఖ్యలో భూగర్భజలాలను వినియోగించుకునే సామర్థ్యం కలిగిన ఈ మొక్కలతో పర్యావరణానికి  చేటు అని  మరికొన్ని అరబ్‌దేశాలు గుర్తించాయి.


  మొక్కలను నిషేధించాలి..

మహారాష్ట్రలోని పూణే, మన పొరుగున ఉన్న తెలంగాణలో  దుబాయి మొక్కలను నాటడాన్ని నిషేధించినట్లుగానే మన రాష్ట్రంలో కూడా నిషేధించాలి. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలిగించే ఏ అంశానైనా  ప్రభుత్వాలు అడ్డుకోవాలి.

అఖిలేష్ , కేజీ మార్గ్, న్యూఢిల్లీ, పర్యావరణ ప్రేమికుడు..

Friday, 29 July 2022

ప్రీమియం తత్కాల్‌పై రైల్వే శాఖ కీలక నిర్ణయం..

 ప్రీమియం తత్కాల్‌పై రైల్వే శాఖ కీలక నిర్ణయం..



తెలంగాణ:

దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ప్రీమియం తత్కాల్ బుకింగ్‌ని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం దాదాపు 80 రైళ్లకు ప్రీమియం తత్కాల్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. త్వరలో అన్ని రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దీని ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. 2020-21 సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్‌ల ద్వారా రూ.500 కోట్లకుపైగా ఆదాయం సమకూరిందని నివేదికలు చెబుతున్నాయి.

చివరి నిమిషంలో ప్రయాణించే ప్యాసింజర్లు ప్రీమియం తత్కాల్‌ కోటాలో రైల్వే టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. వీటిని డైనమిక్ ఫేర్‌ విధానంలో కొన్ని సీట్లను ప్రయాణికులకు కేటాయిస్తారు. డైనమిక్‌ ఫేర్‌ అనగా సీట్ల సంఖ్య పెరిగే కొద్ది డిమాండ్‌కు అనుగుణంగా టికెట్‌ ధర పెరుగుతుంటుంది. కేవలం ఈ కోటా కింద ఉన్న ఛార్జీలో ప్రాథమిక రైలు ఛార్జీలు, అదనపు తత్కాల్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్‌ సమయంలో సీనియర్‌ సిటిజన్‌ల ఛార్జీల రాయితీలను ఉపసంహరించుకుంది రైల్వే శాఖ. ప్రస్తుతం వాటిని కూడా మళ్లీ పునరుద్దరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Thursday, 28 July 2022

ఇక పక్కాగా ఓటరు జాబితా..

 ఇక పక్కాగా ఓటరు జాబితా..



తెలంగాణ:

భారత ఎన్నికల సంఘం నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఓటరు నమోదులో పలుదశల్లో అవకాశమిస్తూ ఫారం-8ఏ ను రద్దు చేసేందుకు సిద్దమైంది. బోగస్‌ ఓటర్లను ఏరివేసేందుకు అనేక సాంకేతికతలతో యాప్‌లను వినియోగిస్తోంది. త్వరలోనే ఆధార్‌కార్డుతో ఓటర్‌ ఐడీని అనుసంధానం చేసే ప్రతిపాదన అమలుకు యోచిస్తోంది. ఇకమీదట 18 ఏళ్లు నిండేసరికే ఓటర్‌ జాబితాలో పేరు చేర్చి ఓటర్‌ ఐడీని అందించేలా కార్యచరణ చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఒక్కో ఓటుపై అభ్యంతరాలు, దొంగ ఓట్లు, బోగస్‌ ఓట్ల వ్యవహారంతో చర్చ జరగడం ఎన్నికల సంఘానికి చెడ్డపేరు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో పారదర్శికతకు పెద్దపీట వేసేలా కసరత్తు చేస్తున్నది. తాజాగా ఓటు నమోదుకు ఉన్న 18ఏళ్లు నిండిన యువతకు అవకాశాలను కేంద్ర ఎన్నికల సంఘం మరింత విస్తృతం చేసింది. జనవరి 1నాటికి 18ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన యువతకు ఈ దఫా అవకాశం కల్పించేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. 18ఏళ్లు నిండేవరకు వేచిచూడాల్సిన అవసరంలేదని ఎన్నికల సంఘం పేర్కొంటోంది. 17ఏళ్లు నిండినవారికి ఓటర్‌కార్డు కోసం ముందస్తు దరఖాస్తులకు అకాశమివ్వనుంది. ఇకపై 17ఏళ్లు వాటినవారంతా ముందస్తు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18ఏళ్లు నిండిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం వారికి కార్డును అందించి ఓటు హక్కును కల్పిస్తుంది. ఈ అంశంపై ప్రజల్లో అవగాహనకు ఆదేశించింది.

గతంలో ఓటర్‌ నమోదుకు జనవరి 1ని ప్రామాణికంగా తీసుకోవడం ఆనవాయితీగా ఉంది.

తేదీనాటికి 18ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు లభించడం జరిగేది. కాగా ఈ ఏడాదినుంచి తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1లను ప్రామాణికంగా తీసుకొని ఓటు హక్కు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఓటర్‌ జాబితాలో తప్పులను సరిజేతకు, సవరణలకు పూర్తిస్థాయిలో అవకాశాలను విస్తృతం చేసింది. ఆగష్టు 4నుంచి అక్టోబర్‌ 24 వరకు ప్రీ రివిజన్‌ తర్వాత నవంబర్‌ 9న ముసాయిదా ఓటర్‌ జాబితాను వెల్లడించనున్నారు. డిసెంబర్‌ 8వరకు అభ్యంతరాల స్వీకరణ, జనవరి 5 తర్వాత తుది ఓటర్‌ జాబితాను ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. ఓటర్‌ నమోదుకు ఏటా నాలుగుసార్లు అవకాశం కల్పించనున్నారు. దీంతో ఓటు హక్కు పొందేవీలు ప్రజలకు మరింత చేరువకానుంది. ఎన్‌వీఎస్‌ఆర్‌ పోర్టల్‌లో నేరుగా ఫోన్‌ ద్వారా ఓటు హక్కును పొందేందుకు మరింత సులభతరమైన విధానాలను ఈసీ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఫారం 6, ఫారం 7, ఫారం 6బీ, ఫారం 8లను కొత్త రకంలో అందుబాటులోకి తేనున్నారు. ఫారం 8ఏను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ కార్డును ఇవ్వని ఓటర్లు ఈజీఎస్‌ జాబ్‌కార్డు, బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఖాతా బుక్‌ను, హెల్త్‌ ఇన్ష్యూరెన్స్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, పెన్షన్‌ డాక్యుమెంట్‌, ఉద్యోగులు ఎంప్లాయీ ఐడీకార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అధికారి కార్డులు, యూనిక్‌ ఐడీ రిజిస్ట్రేషన్లకు చెందిన ఏదైనా కార్డును జత చేయాలని ఈసీ సూచించింది. ఈ మేరకు బోగస్‌ ఓట్లకు చెక్‌ పెట్టేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. తద్వారా ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో పారదర్శక ఎన్నికలకు ఇది కీలక అడుగుగా మారనుందని ఎన్నికల సంఘం చెబుతోంది.

Wednesday, 27 July 2022

సొంత పనులకు పంచాయతీ ట్రాక్టర్..!

 సొంత పనులకు పంచాయతీ ట్రాక్టర్..!




పంచాయతీ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న కొంత మంది సర్పంచ్ లు..

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు..

చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్..


తెలంగాణ:

గ్రామపంచాయతీ అవసరాలకు వాడాల్సిన పంచాయితీ ట్రాక్టర్ ను కొంతమంది సర్పంచులు తమ ఇష్టానికి వాడుకుంటున్నారు.

గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడంతో పాటు, హరితహారం, పల్లె ప్రకృతి వనం మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లు నేడు ప్రైవేట్ పనులలో బిజీగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో కొన్న ట్రాక్టరే అని కొందరు తమ సొంత ట్రాక్టర్‌లా భావిస్తున్నట్లుంది. మేము ఏమి చేసినా నడుస్తుంది అనే కొందరు సర్పంచులు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ వనరులను ఉపయోగించి సొమ్ము చేసుకునే ప్రయత్నం, కొంత బంధు ప్రీతి చూపిస్తున్న సంఘటన ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని లోక్యతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తుల పనులకు ఇష్టారాజ్యంగా మారింది. కూసుమంచి మండల కేంద్రంలోని నేలకొండపల్లి రోడ్డులో లోక్యతండాకు చెందిన వ్యక్తి ఇళ్లు నిర్మాణం చేస్తున్నాడు. అయితే, ఆ నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ లోక్యతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తో సమకూర్చుతున్నారు. మండల పరిషత్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ తంతు జరుగుతున్నా, అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి నెలవారీగా EMI రూపంలో లోన్ చెల్లిస్తుంటే లోక్యతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మాత్రం బయట ప్రైవేట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోయారు. ఈ ఘటన పై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అంటున్నారు.

Tuesday, 26 July 2022

మందుబాబులకు అడ్డాగా విలేజ్ పార్కులు..

 మందుబాబులకు అడ్డాగా విలేజ్  పార్కులు..



తెలంగాణ:

ప్ర‌కృతి సౌంద‌ర్యాల‌కు మ‌రింత శోభ‌నిచ్చే విధంగా, ప‌ల్లెల‌కు కొత్తందం తెచ్చేలా పల్లె ప్ర‌కృతి వ‌నాలను హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కానీ, ప్రస్తుతం పలు గ్రామాల్లో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు, పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. ఒక్కో పల్లె ప్రకృతి వనానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. కానీ, అవి చాలా వరకు ఉపయోగంలో లేవు. కొన్ని గ్రామానికి దూరంగా ఉండటం వలన అక్కడికి ప్రజలెవరూ వెళ్ళడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో, గ్రామ ప్రజలు, సందర్శకులు వెళ్ళడానికి వీలు లేకుండా బోసిపోతూ కనబడుతున్నాయి. నిర్మానుష్యంగా ఉన్న పల్లె ప్రకృతి వనాలను అదనుగా చూసుకుని కొంత మంది మందుబాబులు మందు కొట్టడానికి వీటిని అడ్డాలుగా చేసుకున్నారు. ఇందుకు ఉదాహరణగా  ములుగు మండలం లోని మల్లంపల్లి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనం నే చెప్పొచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా  లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు ఇలా నిలవడం బాధాకరం. మరికొన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను పరిశీలిస్తే ఖాళీ మందు సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు, గ్లాసులతో దుర్భరంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా, పల్లె ప్రకృతి వనంలో ఎండిపోయి, రాలిన ఆకులతో నడకదారి నిండిపోయి కనిపిస్తుంది. ఇప్పటికైనా పల్లె ప్రకృతి వనాలపై పంచాయతీ కార్యదర్శులు, జీపి సిబ్బంది దృష్టి సారించి పల్లె ప్రజలకు అందుబాటులోకి పార్క్ ను తీసుకురావాలి. రాత్రి వేళల్లో విలేజ్ పార్క్ లో మద్యం తాగే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పల్లె ప్రజలు కోరుకుంటున్నారు.

Monday, 25 July 2022

దంచి కొడుతున్న ఎండలు..

 దంచి కొడుతున్న ఎండలు..



పలు రైళ్లు రద్దు.. స్కూళ్లు మూసివేత..

నరకం చూస్తున్న యూరప్ వాసులు..


తెలంగాణ: 

వాతావరణం అనేక మార్పులకు కారణమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే, అతివృష్టి.. లేదంటే అనావృష్టి, అత్యధిక ఉష్ణోగ్రతలతో అనేక దేశాలు అల్లాడిపోతున్నాయి.

ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరైనా యూరప్ దేశాలు సైతం ఇప్పుడు వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాయి. గత కొన్ని రోజులుగా యూకే, స్పెయిన్, పోర్చుగల్ ఫ్రాన్స్‌లలో ఎండలు మండిపోతున్నాయి.

ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి.


దీనికి తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో,  బ్రిటన్ వాతావరణ విభాగం రెడ్ వార్నింగ్ జారీ చేసింది.

లండన్‌తో పాటు ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది. సోమవారం ఎండ, వడగాలులు, ఉక్కపోతతో బ్రిటన్ వాసులు అల్లాడిపోయారు.


దీంతో, కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా, పాఠశాలలను మూసివేశారు.అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం కోరింది. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్‌లలోని గ్రామీణ ప్రాంతాల్లో కార్చిచ్చు కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. 2019లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని బొటానిక్ గార్డెన్ పరిసరాల్లో నమోదైన 38.7 సెల్సియస్‌ల ఉష్ణోగ్రతే ఇప్పటి వరకు బ్రిటన్‌లో అత్యధికం. ఈ రికార్డు సోమవారం బద్ధలైంది.

Saturday, 23 July 2022

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..

 తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..



తెలంగాణ:


రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణలోని 11 జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. అంతేగాక, రాబోయే 4 వారాల పాటు వ‌ర్షాలు స‌మృద్ధిగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. వర్షాల దృష్ట్యా నగర వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. అదేవిధంగా మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు అలర్ట్‌ జారీ చేశారు వాతావరణ శాఖాధికారులు.

Wednesday, 20 July 2022

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..

 శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..



తెలంగాణ:


 తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ వెబ్ సైట్‌లో పేర్కొంది. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లు కాగా శుక్రవారం మినహా మిగతా రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయిచనున్నట్లుగా వెల్లడించింది. అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు.. అర్థరాత్రి దాటిన తర్వాత పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగానే వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకోవాలి. సుప్రభాత సేవలో భక్తులు అంగ ప్రదక్షిణ మొక్కులు తీర్చుకుంటారు.


కోవిడ్ కారణంగా తిరుమలలో రెండేళ్లుగా అంగప్రదక్షిణ టోకెన్లు నిలిచిపోయాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ నెల నుంచి మళ్లీ ఈ టోకెన్లను టీటీడీ అందిస్తోంది. అయితే సీఆర్ఓ కార్యాలయంలో ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉండేవి. జూలై నుంచి ఆన్ లైన్ లో అంగప్రదక్షిణ టికెట్లు అందిస్తున్నారు. అయితే ఇకముందు నేరుగా టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.


ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే.. రైలు సర్వీసులను పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఎస్‌సీఆర్ మంగళవారం ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్ – తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య నడవనున్నాయి. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని.. అదేవిధంగా తిరుమల తిరుపతికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు.

Tuesday, 19 July 2022

డ్రగ్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ మోడల్..

 డ్రగ్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ మోడల్..



తెలంగాణ:

దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా, డ్రగ్స్ దందా నిరంతరం కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌తో ఓ మోడల్‌తో పాటు అతని స్నేహితురాలిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లో డ్రగ్స్ సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు.

శుభమ్ మల్హోత్రా (26), శుభమ్ ఫ్రెండ్ కీర్తి (28) హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీలో విక్రయించేవారని చెప్పారు. ఢిల్లీ యూనివర్శిటీకి కొంతమంది డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు  ఢిల్లీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. డ్రగ్స్ తరలిస్తున్న సమయంలో శుభమ్, కీర్తిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా,మని తెలిపారు. శుభమ్, స్నేహితురాలు కీర్తి లు హిమాచల్‌ ప్రదేశ్ లో గంజాయిని కొనుగోలు చేసి, కారులో గంజాయిని ఢిల్లీకి స్మగ్లింగ్ చేసేవారని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

కారుని భద్రతాదళాలు తనిఖీలు చేస్తున్న సమయంలో తప్పించుకోవడానికి ఇరువు సినీ ఫక్కీలో నాటకం ఆడేవారని,  కీర్తి గర్భవతిగా నటిస్తుందని అందుకోసం ఒక దిండుని ఉపయోగించేదని చెప్పారు. శుభమ్ హిమాచల్‌లో ఉన్నట్లు క్రైం బ్రాంచ్‌కు జూలై 12న సమాచారం అందింది. దీంతో  వీరిద్దరిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేసి.. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ తిరిగి వస్తుండగా.. ఢిల్లీ సింధు సరిహద్దు వద్ద ఉచ్చు బిగించారు. భారీ వర్షాల మధ్య వెంబడించి..  ఢిల్లీలోని గుప్తాచౌక్ వద్ద నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మార్గం కు మంత్రి ఎర్ర‌బెల్లి అభినంద‌న‌లు..

 మార్గంకు మంత్రి ఎర్ర‌బెల్లి అభినంద‌న‌లు..



తెలంగాణ:

తెలుగు విశ్వ‌విద్యాల‌యం నుంచి గౌరవ డాక్ట‌రేట్ సాధించిన ఎర్రబెల్లి ప్ర‌జా సంబంధాల అధికారి మార్గం ల‌క్ష్మీనారాయ‌ణ‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావు అభినందించారు. తెలుగు విశ్వ‌విద్యాల‌యం గిరిజన విజ్ఞాన‌ అధ్య‌య‌న శాఖ ఆధ్వ‌ర్యంలో, వ‌రంగ‌ల్ లోని జాన‌ప‌ద గిరిజ‌న విజ్ఞాన పీఠంలో మారుతున్న.. గిరిజ‌నుల సామాజిక‌, సాంస్కృతిక స్థితిగ‌తులు - ఐ.టి.డి.ఎ. ప్ర‌భావం, గోవింద‌రావుపేట మండ‌లం.. అనే అంశంపై యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భ‌ట్టు ర‌మేశ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌రిశోధ‌న చేయ‌గా, మార్గం ల‌క్ష్మీనారాయ‌ణ‌కు యూనివ‌ర్సిటీ డాక్ట‌రేట్‌ను ప్ర‌క‌టించింది. ర‌వీంద్ర‌భార‌తిలో బుధవారం రోజున జ‌రిగే స్నాత‌కోత్స‌వంలో ఈ అవార్డును అంద‌చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న వ‌ద్ద పి.ఆర్‌.ఓ.గా ప‌ని చేస్తున్న మార్గం ను మంత్రి హైద‌రాబాద్ లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో అభినందించారు. శాలువాతో స‌త్క‌రించారు. త‌న వ‌ద్ద ప‌ని చేస్తూనే, గిరిజ‌న సామాజిక‌, సాంస్కృతిక స్థితిగ‌తుల‌పై, వారి అభివృద్ధిలో ఐ.టి.డి.ఎ. పాత్ర‌ను కూలంకశంగా తుల‌నాత్మ‌క ప‌రిశోధ‌నాత్మ‌క అధ్య‌య‌నం చేసి, అవార్డును పొంద‌డం త‌న‌కెంతో గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని అన్నారు. మార్గం మ‌రిన్ని ఉన్న‌త చ‌దువులు, అవ‌కాశాలు పొందాల‌ని ఆకాంక్షించారు.

Monday, 18 July 2022

రాష్ట్రపతి ఎన్నిక కొరకు ముగిసిన పోలింగ్..

 రాష్ట్రపతి ఎన్నిక కొరకు ముగిసిన పోలింగ్..



ఓటు వేసిన సోనియా, రాహుల్..

వీల్ చైర్ పైన వచ్చి ఓటేసిన మన్మోహన్ సింగ్..


తెలంగాణ:

రాష్ట్రపతి ఎన్నిక కోసం జరిగిన పోలింగ్‌ ముగిసింది. ఉదయం నుంచి ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఆయా రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌ భవనంలో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ఈనెల 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీలో 173 మంది ఓటు వేయగా, తెలంగాణలో 118 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 26న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో మరోసారి విపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా కూడా హాజరుకానున్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి.. వైసీపీ, టీడీపీ ఓటేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్. ఓవైపు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీలో పలు రాజకీయ పక్షాలు నిరసన చేపట్టాయి. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఒకే మాట మీద నిలబడి.. ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. 

రాష్ట్రపతి అభ్యర్తి యశ్వంత్ సిన్హాకు ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓటు వేయవచ్చని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ నేతలు వెస్టిన్ హోటల్‌లో రాత్రులు గడిపారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల కోసం తమ ఓటు వేశారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ కూడా ఓటు వేశారు.



మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌పై పార్లమెంటుకు వచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Sunday, 17 July 2022

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు..

 నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు..



తెలంగాణ:


నేటి నుంచి కొనసాగే వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు, నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు రాజ్​నాథ్ సింగ్, పీయూష్ గోయల్ హాజరు కాగా.. కాంగ్రెస్ నుంచి మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌధురి, జైరాం రమేశ్‌ సహా డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, బీజేడీ, వైకాపా, తెరాస, ఆర్జేడీ, శివసేన నేతలు హాజరయ్యారు.

సభాసమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సభలు సజావుగా సాగేలా సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో ప్రహ్లాద్ జోషి పార్టీలను కోరారు. అయితే ధరల పెరుగుదల, అగ్నిపథ్, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన అన్‌ పార్లమెంటరీ పదాలపైనా అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. 

అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని విపక్ష నేతలందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితి వంటి కీలక అంశాలపై సమావేశాల్లో చర్చ జరపాలని పట్టుబట్టినట్లు సమాచారం.అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు డిమాండ్ చేశాయి. లంకలోని తమిళుల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక సంక్షోభంపై మంగళవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

Thursday, 14 July 2022

భద్రాచలంలో గోదావరి బ్రిడ్జి పై రాకపోకలు బంద్..

 భద్రాచలంలో గోదావరి బ్రిడ్జి పై రాకపోకలు బంద్..



- భద్రాచలం, బూర్గంపహాడ్ లో 144 సెక్షన్ అమలు..

- భారీగా మోహరించిన పోలీసు బలగాలు..

- మహోగ్రరూపం దాలుస్తున్న గోదారమ్మ..

- నాలుగు జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను అలర్ట్ చేసిన ప్రభుత్వం..

- వందేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి వరద ఉధృతి రావడం..


తెలంగాణ:


గోదావరి నది మహోగ్ర రూపం దాల్చుతోంది. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో జులైలోనే గోదావరి నదికి భారీ స్థాయిలో వరదలు వస్తుండగా, భద్రాచలం వద్ద నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉందని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ హెచ్చరించారు. భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించాలని ఆయన ఆదేశించారు.

ఎగువన నుంచి పెద్ద మొత్తంలో వరద ప్రవాహం వస్తుండటంతో, గోదావరి నది మహోగ్ర రూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గురువారం రాత్రికి 65 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం గోదావరి నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని,  ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలని ఆయన ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, ముందు జాగ్రత్తగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి వంతెనపై రాకపోకలు నిలిపేశారు. అటు భద్రాచలం వద్ద, ఇటు సారపాక వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. 48 గంటలపాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. 36 ఏళ్ల తర్వాత భద్రాచలం వంతెనపై రాకపోకలు నిలిపేయడం గమనార్హం. ఇప్పటికే రామాలయాన్ని వరద చుట్టుముట్టింది.

1986 ఆగస్టులో భద్రాచలం వద్ద 75.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం. ఆ తర్వాత మరొకసారి మాత్రమే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. 1990 ఆగస్టు 24న గోదావరి నీటిమట్టం 70.8 అడుగులకు చేరింది. 2006లో 66.9 అడుగులు మేర నీటి మట్టం నమోదైంది. ఆ రెండు సందర్భాల్లోనూ ఆగస్టు నెలలోనే గోదావరికి వరదలు రాగా, వందేళ్ల చరిత్రలో జులై నెలలో గోదావరికి ఈ స్థాయిలో వరద ప్రవాహం రావడం ఇదే తొలిసారి.

Wednesday, 13 July 2022

పోలవరానికి భారీగా వరద నీరు..

 పోలవరానికి భారీగా వరద నీరు..



ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ..


తెలంగాణ:

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులూ, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా, నదుల్లో వరద ప్రవాహం ఎక్కవవుతోంది. వీటికి తోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో భారీగా వరద వస్తోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉరకలేస్తోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 15 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా బంగాళాఖాతం వైపు పరుగులు పెడుతోంది. భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టులోని 48 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గేట్లను నిర్మించారు. ఒక్కో గేటును 16 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. వీటిని నియంత్రించేందుకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, గోదావరి నదీపాయలకు వరద నీరు పోటెత్తింది. దీంతో, పది లంక గ్రామాలు వరద నీటి తాకిడికి గురయ్యాయి. గోగుల్లంక, భైరవలంక, కేసనకుర్రు, పొగాకు లంక, పల్లెగూడాల. కూనలంక, గురజాపులంక, కమిని, సలాదివారి పాలెం గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇళ్ల మధ్య నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తాగేందుకు నీరు కూడా దొరకడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో పెరుగుతున్న వరద కారణంగా ధవళేశ్వరం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Tuesday, 12 July 2022

ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ..

 ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ..



  • భద్రాచలానికి ప్రమాద హెచ్చరికలు జారీ..
  • సాయంత్రం కల్లా నీటిమట్టం 66 అడుగులకు చేరే అవకాశం..
  • కరకట్ట వైపు పొంచి ఉన్న ప్రమాదం..


తెలంగాణ:

భారీ వర్షాలకు తెలంగాణలోని భద్రాచలం వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ నదికి వరద ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, భద్రాచలం వద్ద ముప్పు పొంచి ఉందని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎగువ నుండి వస్తున్న వరదల వల్ల ఈరోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులు వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద శరవేగంగా గోదావరి పెరుగుతున్నదని, ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించి, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. గోదావరి 66 అడుగులకు చేరితే కరకట్ట పరిస్థితి ఏంటని? ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే, బూర్గంపాడు వైపు కరకట్ట నిర్మాణం జరగలేదు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 66 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరితే భద్రాచలం పాత వంతెన పై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ పోతుండటంతో చుట్టు పక్కన ఉన్న ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఒకవేళ గోదావరి నీటిమట్టం 66 అడుగులు దాటితే పరివాహక  ముంపు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నదని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

జోరు వాన.. తగ్గని ముసురు.

 జోరు వాన.. తగ్గని ముసురు.



మరో మూడు రోజులు ప్రమాద ఘంటికలు..

మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు..

15 వరకు తెలంగాణలో రెడ్ అలర్ట్..


తెలంగాణ:

తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వీడేట్టులేవు. ఈ నెల 15 వరకు తెలంగాణలోని కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాన్ని రెడ్ అలర్ట్ గా జారీ చేసింది. సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఓవైపు ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితలం ఆవర్తనం విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.

Monday, 11 July 2022

తెలంగాణలో మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు..

 తెలంగాణలో మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు..



హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక..

లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలి..


తెలంగాణ:

రాష్ట్రంలో మరో రెండు రోజుల భారీ వర్షాలు కురుస్తాయని దాదాపు అన్ని జిల్లాలోనూ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  సోమవారం కుమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల , ఆదివాద్ , జగిత్యాల రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్  భూపాలపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ,మేడ్చల్ మల్కాజ్ గిరి , జనగామ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. 12న(మంగళ వారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల , కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, యదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది. కాగా, గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం, మహదేవ్ పూర్ లో 34.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాటారంలో 34.3, మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 23.4, చెన్నూరులో 23.3, నిర్మల్ జిల్లా ముథోల్​లో 22.9, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 22.6, నిర్మల్ జిల్లా భైంసాలో 19.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారంలో 19.1, నిజామాబాద్ జిల్లా నవీపేట్​లో 19, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 18.2, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 17.9, నిజామాబాద్ జిల్లా మాచర్లలో 17.8, అదే జిల్లా మదనపల్లెలో 17.6, ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్ లో 17.4, నిజామాబాద్ జిల్లా మగిడిలో 16.9, ఆసిఫాబాద్ జిల్లా ఎల్కపల్లిలో 16.8, నిజామాబాద్ జిల్లా రెంజల్​లో 16.5, పెద్దపల్లి జిల్లా ఎక్లాస్ పూర్​లో 16.2, నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో 16 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి..

 భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి..





 మూడో ప్రమాద హెచ్చరిక జారీ 


తెలంగాణ:

గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువతో పాటు నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం భారీగా పెరగడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరింది. నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. వరద పోటెత్తుతుండడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Saturday, 9 July 2022

తిరుమలలో పెరిగిన చలి తీవ్రత..

 తిరుమలలో పెరిగిన చలి తీవ్రత..



తెలంగాణ:

                                                                          తిరుమలలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తుంది. అప్పటి నుంచి ఎండనే మాటే లేకుండా పోయింది . అడపాదడపా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూనే ఉంది. నిన్నటి నుంచి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో, తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో చాలామంది వృద్ధులు చలికి ఉండలేక తిరుగు ప్రయాణమయ్యారు.

Friday, 8 July 2022

అమర్నాథ్ లో ఆకస్మిక వరదలు..

 అమర్నాథ్ లో ఆకస్మిక వరదలు..



10 మంది మృతి.. పలువురు గల్లంతు..


తెలంగాణ:

ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు అమర్‌నాథ్‌ యాత్రికులు గల్లంతయ్యారు. జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. వరదల ధాటికి అమర్‌నాథ్‌ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో 40 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మిగతా వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అమర్నాథ్‌ పరిసరాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. దీంతో, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. వరదల దృష్ట్యా అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

అమర్నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకోవాలంటే శ్రీనగర్‌కు దాదాపు 90కి.మీ దూరంలో పహల్గామ్‌తోపాటు బాల్తాల్‌ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. ఆయా మార్గాల్లోని బేస్‌ క్యాంపుల నుంచి బ్యాచ్‌ల వారీగా పంపిస్తారు. జూన్‌ 30న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటికే లక్ష మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో  వెల్లడించారు.

Wednesday, 6 July 2022

లోపించిన పారిశుధ్యం..

 లోపించిన పారిశుధ్యం..



- గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే..

- నిరుపయోగంగా డంపింగ్ యార్డులు..

- పట్టించుకోని అధికారులు..


తెలంగాణ:


రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధే దేశాభివృద్ధని గొప్పలు చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. గ్రామ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన ప్రజాప్రతినిధులు, సంబధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాలా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ఫలితంగా విష జ్వరాలు విజృభిస్తున్నాయి. దీంతో,  ప్రజలు అనారోగ్యానికి గురై అస్పత్రుల పాలవుతున్నారు. అయినా, అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పారిశుధ్యం లోపించి ప్రజలు అస్పత్రుల పాలైతే తప్పా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించడం లేదు. గ్రామాభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర వహించే పంచాయతీ కార్యదర్శులు ఏదో నామమాత్రంగా గ్రామాలను సందర్శిస్తున్నారు. అభివృది పనుల పేరిట జేసీబీలతో పైపు లైన్‌లు నిర్మించడంతో పాత పైపులు ధ్వంసమై నీటి సరఫరా అయ్యే చోట నీరు కలుషితమవుతుంది. వెంటనే సరి చేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్మాణం పూర్తయ్యే వరకు స్పందించడం లేదు. కొందరు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు రావడం లేదని ఫిర్యాదు చేస్తే తప్పా, గ్రామాన్ని సంద ర్శించడం లేదు. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ త్రాగు నీరు, విద్యుత్‌, కరెంట్‌, రోడ్లు, మురికి కాలువులు తదితర సౌకర్యా లు ప్రజలకు కల్పించాలి. మురికి కాల్వల్లో చెత్తా, చెదారం పేరుకుపోయి అపరిశుభ్రం అవుతుందని, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రచారం నిర్వహించారు. దీంతో ఇంటింటికీ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. వాటికి బిల్లులు రాకపోవడంతో అటు మురికి కాల్వలోకి నీరు వెళ్లకా, ఇటు ఇంకుడు గుంతలకు వదలకా రోడ్డుపైనే మురుగు నీరు ప్రవాహి స్తుంది. దీంతో, దుర్గంధం, అపరిశుభ్రత నెలకొని వ్యాధులు వచ్చేం దుకు ఆస్కారమవుతుంది. అడపాదడపా వర్షాలు పడటంతో వర్షపు నీరు, బురద నీరు లోతట్టు ప్రాంతానికి చేరి దుర్గంధం వెదజల్లు తోంది. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి  బిల్లులు చెల్లించాల్సిన అధికారులు పూర్తిగా దాటా వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Monday, 4 July 2022

3నెలలు.. 7వేల లావాదేవీలు.. 30సిమ్‌ కార్డులు.. రూ.కోట్లు స్వాహా..!

 3నెలలు.. 7వేల లావాదేవీలు.. 30సిమ్‌ కార్డులు.. రూ.కోట్లు స్వాహా..!



తెలంగాణ:


ఏపీలోని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం టి.కందులవారిపల్లెకి చెందిన సైబర్‌ నేరగాళ్లు సాయికిరణ్, ప్రశాంత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు కోల్‌కత తీసుకెళ్లారు. టి.కందులవారిపల్లెకి చెందిన సాయికిరణ్‌ ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోని తన ఖాతాలో ఉన్న రూ.10వేలు డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఖాతా ఫ్రీజ్‌ అయి ఉండటంతో బ్యాంక్‌ అధికారులను కలిశాడు. వారికి అనుమానం వచ్చి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేంతవరకు సాయికిరణ్‌తో టైంపాస్‌ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి సిబ్బందితో వచ్చి సాయికిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయికిరణ్‌పై కోల్‌కతలో సైబర్‌ కేసు నమోదై ఉండటంతో పోలీసులు అక్కడి పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సోమవారం కోల్‌కత్తా పోలీసులు రాజంపేట పట్టణానికి చేరుకున్నారు.

పట్టణ పోలీసుల అదుపులో ఉన్న సాయికిరణ్‌తో పాటు అతడికి సహకరించిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌ను కూడా అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లారు. సాయికిరణ్‌ మూడునెలల వ్యవధిలో ఏడువేల లావాదేవీలు చేసినట్లు తెలిసింది. ఇందుకు 30 సిమ్‌ కార్డులను వినియోగించినట్లు సమాచారం. ఈ లావాదేవీల్లో దేశవ్యాప్తంగా పలువురి బ్యాంకు ఖాతాలను హ్యాక్‌చేసి కోట్లాది రూపాయలను వివిధ ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసింది. కొన్ని ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేరాలపై కోల్‌కతలో నమోదైన కేసులో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు.

అమెరికాలో మళ్లీ తుపాకుల మోత..

 అమెరికాలో మళ్లీ తుపాకుల మోత..



తెలంగాణ:


అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా  షికాగో నగర శివారులోని ఐలండ్‌ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్‌ డే పరేడ్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో  ఆరుగురు అక్కడికక్కడే మరణించగా 30 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాల్పుల సమయంలో పరేడ్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాల్పులతో భయాందోళన లోనై వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు మాత్రం పరారీలో ఉన్నాడు. అతను కాల్పులు జరిపిన తుపాకీ దొరికినట్టు పోలీసులు చెప్పారు. కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తొలుత అధికారులు చెప్పినా, రక్తం మడుగులో పడున్న మూడు మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Sunday, 3 July 2022

ఖాజీపేటలో లోకో పైలట్ల కుటుంబ సభ్యుల ధర్నా..

 ఖాజీపేటలో లోకో పైలట్ల కుటుంబ సభ్యుల ధర్నా..



తెలంగాణ:


ఖాజీపేటలో గత ఐదు రోజుల నుండి  రైల్వే లోకో పైలట్లు నిర్వహిస్తున్న ధర్నా నిరసన కార్యక్రమాలు ఉదృత రూపు దాల్చుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు లోకో పైలట్లు కుటుంబ సభ్యులతో సహా కలిసి క్రూలాబీ ముందు నిరసన ప్రదర్శనను చేపట్టారు. ఈ మధ్యకాలంలో కాజీపేట నుండి ఆపరేట్ చేయబడుతున్న కోచింగ్ లింకులను ఒక్కొక్కటిగా విజయవాడకు తరలించడంతో కార్మికుల్లో అసహనం నెలకొని ఈ నిరసనలకు దిగినారు. ఈ నిరసనలో లోకో పైలట్ల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ వారిని ఇక్కడి నుండి వేరే చోట్లకు బదిలీ చేసి కుటుంబ సభ్యులను వేదనలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...